Chandrababu : నేడు గేమ్ ఛేంజర్ పై చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.;

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్తారు. ఉదయం 11.30 నుంచి 01.15 సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా, హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై సమీక్షిస్తారు.
వరస సమీక్షలతో...
మధ్యాహ్నం 03.15 గంటలకు సీఆర్డీఏ, అనంతరం జల్ జీవన్ మిషన్‌పై చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. 03.45 గంటలకు పోలవరం-బనకచర్ల అనుసంధానంపై అధికారులతో సమావేశమవుతారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు గేమ్ ఛేంజర్ గా భావించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దీనిని పట్టాలెక్కించేందుకు అధికారులతో సమావేశమవుతున్నారు. సాయంత్రం 06.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.