బెజవాడోళ్లకు పోలీసులు గుడ్ న్యూస్
విజయవాడ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.;

విజయవాడ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ రాత్రి త్వరగా హోటళ్లు మూసివేయాలన్న ఉత్తర్వులతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల చంద్రబాబు దృష్టికి హోటళ్ల యజమానుల సంఘం తీసుకెళ్లింది.
చంద్రబాబు ఆదేశాలతో...
దీంతో చంద్రబాబునాయుడు ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ హోటళ్లు తెరిచి ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ సీపీకి హోటళ్ల సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. తమ విజ్ఞప్తిని పరిశీలించి అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.