Ys Jagan : నేడు కడప జిల్లాలో జగన్ పర్యటన
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. రైతులను పరామర్శించనున్నారు;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని లింగాల మండలంలో ఆయన పర్యటన సాగుతుంది. శనివారం రాత్రి భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. శనివారం కురిసిన ఈదురుగాలులు, భారీ వర్షంతో అరటి తోటలు దారుణంగా దెబ్బతన్నాయి. రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు జగన్ నేడు లింగాల మండలంలో పర్యటించనున్నారు.
రైతులకు పరామర్శ...
మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులతో జగన్ మాట్లాడనున్నారు. వారికి అండగా నిలుస్తామన్న భరోసా ఇవ్వనున్నారు. జగన్ కడప జిల్లాాకు వస్తుండటంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని భావించి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.