ఎంపీల సంతకాలు సేకరిస్తున్నాం.. త్వరలో ప్రధానిని కలుస్తాం

త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు

Update: 2022-03-23 01:42 GMT

త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో ఎంపీల సంతకాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 120 మందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించామని తెలిపారు. లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ యోచనను మానుకోవాలని ఆయన కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను జరగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

రైల్వే ప్రాజెక్టులపై....
ఇక పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కూడా రైల్వే మంత్రిని కలిసి చర్చించామని చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్ర వాటాను రుణంగా మార్చాలని కోరామని, అందుకు ఆయన అంగీకరించారని విజయసాయిరెడ్డి తెలిపారు. కడప - బెంగళూరు లైన్ వేగంగా పూర్తి చేయాలని కోరామన్నారు. కిసాన్ రైళ్లను ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు.


Tags:    

Similar News