2023 అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ కార్లు.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

2023 Best Electric Cars: భారత మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Update: 2023-12-26 02:30 GMT

2023 Best Electric Cars

2023 Best Electric Cars: భారత మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఈవీ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ ఏడాది అంటే 2023లో భారత మార్కెట్లో అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ కార్లు ఏవో చూద్దాం.

టటా నెక్సన్‌ EV- టాటా నెక్సన్‌ ఈవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కారు. ఇది రూమి ఇంటీరియర్‌లను కలిగి ఉంది. అలాగే ఫుల్‌ఛార్జ్‌తో 465 కిలోమీటర్ల వరకు పరుగులు పెడుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.14.74 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)తో ప్రారంభం

మహీంద్రా XUV 400- మహీంద్రా XUV400 అనేది టాటా నెక్సాన్‌ ఈవీకి దగ్గరగా ఉంటుంది. ఇది విశాలమైన క్యాబిన్‌ కలిగి ఉండి 456 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇది స్పోర్టి, కఠినమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.15.99 లక్షలతో ప్రారంభమవుతుంది.

టాటా టియాగో EV- ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ట్రెయిన్‌తో నడిచే హ్యాచ్‌బ్యాక్‌ కావాలనుకునేవారికి టాటా టియోగో ఈవీ ఒక గొప్ప ఆప్షన్‌. ఇది 315 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.8.69 లక్షలతో ప్రారంభమవుతుంది.

MG కామెట్‌ EV - ఎంజీ కామెట్‌ ఈవీ అనేది ఫంకీగా కనిపించే ఎలక్ట్రిక్‌ కారు. దీని డిజైన్‌ ఎంతోగానే ఆకర్షిస్తుంది. ఇది 230 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.7.98 లక్షలతో ప్రారంభం అవుతుంది.

సిట్రోయెన్‌ e-C3 - సిట్రోయెన్‌ ఈ సి3(Citroen) అనేది ప్రత్యేక డిజైన్‌, సెక్యూరిటీ లక్షణాలతో కూడిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ. ఇది 320 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.11.61 లక్షలతో ప్రారంభం.

హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ కారు - ఈ ఈవీ కారు స్పోర్టి డిజైన్‌తో కూడిన స్టైలిష్‌ క ్రాస్‌ఓవర్‌. ఇది సిటి డ్రైవింగ్‌, లాంగ్‌ డ్రైవ్‌లకు రెండింటికి మంచి ఎంపిక. ఇది 452 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, ధర రూ.23.84 లక్షలతో ప్రారంభం అవుతుంది.

MG ZS EV - ఎంజీ జెడ్‌ఎస్‌ ఎలక్ట్రిక్‌ కారు విలాసవంతమైన ఇంటీరియర్స్‌, విశ్వనీయమైన డ్రైవ్‌ ట్రెయిన్‌తో కూడిన ఫీచర్‌ ప్యాక్ట్‌ ఎస్‌యూవీ. ఇది 461 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.22.88 లక్షలతో ప్రారంభం అవుతుంది.

Kia EV6 - కియా ఈవీ6 ప్రపంచంలోని ఉత్తమమైనది గుర్తించింది కంపెనీ. లగ్జరీ అలాగే శక్తివంతమైన పనితీరు కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఇది 528 కిలోమీటర్ల పరిధితో వచ్చింది. దీని ధర రూ.60.95 లక్షలతో ప్రారంభం అవుతుంది.

BMMW iX1 - ఈ కారు సెగ్మెంట్‌లోని మరొక విలాసవంతమైన ఎస్‌యూవీ. వేగవంతమైన ఫుల్‌ ఛార్జ్‌తో 440 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రూ.66.9 లక్షలతో ప్రారంభమవుతుంది.

Mercedes-Benz EQS- ఇది ఈవీ సెగ్మెంట్‌లోని అత్యుత్తమ కారు. దీని మైలేజీ 857 కిలోమీటర్లు. దీని ధర రూ.1.62 కోట్లతో ప్రారంభం అవుతుంది.

Tags:    

Similar News