Electric Car: సింగిల్‌ చార్జ్‌తో 320 కిలోమీటర్లు..సిట్రాయిన్‌ నుంచి నయా కార్‌

ప్రస్తుతం పెట్రోల్‌, డిజిల్‌ ధరలు అధికంగా ఉండటంతో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు వెళ్తున్నాయి. పెట్రోల్‌

Update: 2024-01-25 13:25 GMT

Citroen E-C3

ప్రస్తుతం పెట్రోల్‌, డిజిల్‌ ధరలు అధికంగా ఉండటంతో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు వెళ్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎకలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్కూటర్స్‌, కార్లు ఎలక్ట్రిక్‌ రూపంలో మార్కెట్లోకి రాగా, ఇప్పుడు మరిన్ని ఈవీ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెంచ్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ సిట్రాయిన్‌.. దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను పరిచయం చేసింది.

న్యూ సిట్రాయిన్‌ ఈ-సీ3 షైన్‌ పేరుతో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.13,18,800గా నిర్ణయించింది. ఇది సింగిల్‌ చార్జింగ్‌తో 320 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అయితే ఈ కారు అత్యంత వేగంగా బ్యాటరీ రీచార్జి కానున్నదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. వాహనం, బ్యాటరీ, ఏమోటర్‌పై వ్యారెంటీని పెంచుకునే అవకాశం కూడా కల్పించింది.

2024 సిట్రాయిన్‌-సీ3 మాడల్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఢిల్లీ ఎక్స్‌షోరూం ధరలు. లైవ్‌ మాడల్‌ రూ.11,61,000 ఉండగా, ఫీల్‌ మోడల్‌ రూ.12,69,800 ఉంది, అలాగే ఫీల్‌ వైబ్‌ ప్యాక్‌ రూ.12,84,800, ఫీల్‌ డ్యూయల్‌ టోన్‌ వైబ్‌ ప్యాక్‌ రూ.12,99,800 ఉంది. షైన్‌ రూ.13,19,800, షైన్‌ వైబ్‌ప్యాక్‌ రూ.13,34,800, షైన్‌ డ్యూయల్‌ టోన్‌ వైబ్‌ ప్యాక్‌ రూ.13,49,800 ఉంది.

Tags:    

Similar News