Gold Price Today : బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలిస్తే టచ్ కూడా చేయరు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది;

బంగారం ధరలు పెరుగుతాయని తెలుసు కాని ఇంత స్థాయిలో పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంత పెరిగితే బంగారాన్ని సొంతం చేసుకునేదెవరు? పెరగడం ధరలు భారీగా పతనం కావడానికి కారణమవుతుందా? అన్న అనుమానం కూడా బయలుదేరుతుంది. ఎందుకంటే అమ్మకాలు పడిపోయి బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్ గా ధరలు పడిపోతాయి. ఏ వస్తువుకు అయినా అంతే. అందుకే బంగారం ధరలు ఇంత స్థాయిలో పెరుగుతుండటం చూసిన మార్కెట్ నిపుణులు ఈ పెరుగుదల ఒకరోజు ముంచివేస్తుందని అంచనా వేస్తున్నారు. ధరలు పెరుగుతాయని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టే వారు కొంతగా ఆలోచించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
పతనమయ్యే ఛాన్స్...
ఎందుకంటే ఒక్కసారిగా ధరలు పతమయితే ఇక కొనుగోలు చేసిన వారు, పెట్టుబడిగా పెట్టిన వారు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. మరోవైపు బంగారం ధరలు మరింత పెరుగుతాయని, పెరిగి పెరిగి ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ భారీగా పతనం అయ్యే అవాకాశాలున్నాయన్న హెచ్చరికలను కూడా చేస్తున్నారు. పెరిగిన బంగారం, వెండి ధరలతో ఇప్పటికే కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు లేక జ్యుయలరీ దుకాణాలు ఇప్పటికే వెలవెల పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గే వరకూ వెయిట్ చేయాలని పెట్టుబడి పెట్టే వారు చూస్తుండగా, అవసరం కోసం కొనుగోలు చేసే వారు మాత్రం తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
భారీగా ధరలు పెరిగి...
ఇప్పటికే పది గ్రాముల బంగారం ధరలు 92 వేలకుచేరువలో ఉన్నాయి. కిలో వెండి ధరలు 1.12 లక్షల రూపాయలు పలుకుతుంది. ఇంత ధరలు పెట్టి కొనుగోలు చేయడం అవసరామా? అన్న ప్రశ్న సహజంగా వినియోగదారుల్లో తలెత్తుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 84,260 రూపాయలకు చేరింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,920 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,12,900 రూపాయలుగా నమోదయింది.