Gold Price Today : పసిడిప్రియులకు ప్రియమైన వార్త.. బంగారం ధరలు దిగుతున్నాయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అలాగే వెండి ధరలు కూడా కొద్దిగా దిగివచ్చాయి;
బంగారం అంటేనే మహిళలకు ఎక్కువ ఇష్టం. మహిళలు ఎక్కువగా ఇష్టపడే వస్తువుల్లో చీరల తర్వాత బంగారు నగలుమాత్రమే. తర్వాత వెండి ఆభరణాలు. ఇలా మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలతో కొత్త ఏడాది తొలి రోజు నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు కూడా నిరాశ చెందుతున్నారు. బంగారం అమాంతంగా పెరిగిపోవడంతో ఇక కొనలేమోనన్న ఆందోళనలో కొనుగోలుద దారులు పడిపోయారు.
సురక్షితమైన పెట్టుబడిగా...
బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా అందరూ భావిస్తారు. అందుకే మదుపు చేసే వారు ఎక్కువ మంది బంగారంపైనే ఎక్కువ మంది పెట్టుబడి పెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. స్టేటస్ సింబల్ గా మాత్రమే కాకుండా ఇందులో పొదుపు చేస్తే కష్ట సమయంలో ఆదుకుంటుందని మదుపరులు నమ్ముతారు. అందుకే భూమిపై పెట్టేవారు కూడా బంగారంపై ఎక్కువ మంది మదుపు చేస్తుండటంతో దీనికి గిరాకీ పెరిగింది. దీనికి తోడు అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
కానీ బంగారం ధరలు మాత్రం ఇంకా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు వచ్చే ఏడాదికి ధరలు మరింత పెరుగుతాయని కూడా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అలాగే వెండి ధరలు కూడా కొద్దిగా దిగివచ్చాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,700 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకేనని, మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగానూ ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now