Gold Price Today : తగ్గేదే లేదంటున్న బంగారం ధరలు.. కొత్త ఏడాది కష్టాలేనట
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.;
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తగ్గినప్పటికీ స్వల్పంగానే తగ్గుతుంది. అదే పెరిగిన సమయంలో ధరలు భారీగా పెరుగుతాయి. బంగారానికి ఉన్న అలవాటు ఇది. అనేక కారణాలతో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. భారీగా ధరలు పెరిగినందున కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, అమ్మకాలు ఏమాత్రం తగ్గవని నిపుణులు చెబుతున్నారు. బంగారం పై పెట్టుబడి సురక్షితమైనది కావడంతో ఎవరూ ధరలు గురించి ఆలోచించరని, కొనుగోలు చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
చుక్కలు చూపిస్తున్న...
ఈ ఏడాది మొదటి వారంలోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తుంది. జనవరి ఒకటో తేదీ నుంచి ధరల పెరుగుదల ప్రారంభమయింది. ఇక ఆగేట్లు కనిపించడం లేదు. అయితే అదే సమయంలో వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్త ఏడాది ధరలు పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ఇక పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని, అందుకే బంగారం కొనుగోలుకు ఈ ఏడాది కరెక్ట్ సమయమని సూచిస్తున్నారు. కానీ పేద, మధ్యతరగరి ప్రజలు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
వెండి ధరలు తగ్గి...
మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. పసిడి ఎంత పరుగులు పెడుతుందో, వెండి అంత పతనానికి దారి చూసింది. మొన్నటి వరకూ కిలో వెండి లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు చాలా వరకూ తగ్గి కొంత వరకూ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే వెండి వినయోగం తక్కువ. బంగారానికి డిమాండ్ ఎక్కువ కావడంతో దానిని ఎవరూ పట్టించుకోరు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,810 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,340 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now