Gold Price Today: మహిళలకు మనసు పులకించేంతటి వార్త.. బంగారం ధరలు నేడు ఇలా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత వరకూ తగ్గుదల కనిపించింది.;

Update: 2025-01-07 03:26 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న వార్తలకు చెక్ పెడుతూ గత కొద్ది రోజులుగా ధరలు పెరగడం లేదు. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ పెరిగిన ధరలు పరిగణనలోకి తీసుకోని జనం ఈరోజు ధరలు పెరగకపోతే ఆనంద పడిపోతూ కొనుగోలు చేస్తుండటం బంగారం విషయంలో అలవాటు. అందుకే ఏ రోజుకారోజు ధరలు పెరుగుతున్నా ఒక్కరోజు ధరలు తగ్గినా, స్థిరంగా ఉన్నా సరే అంతకంటే ఆనందం మరేముంటుందన్న రీతిలో జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడతారు. నిన్న మొన్నటి వరకూ కొనుగోలుదారులకు బంగారం ధరలు చుక్కలు చూపించాయి. భారీగా ధరలు పెరగడంతో బంగారాన్ని చూడాలంటేనే భయమేసే పరిస్థితి ఏర్పడింది.

రెండు రోజులుగా...
అయితే గత రెండు రోజులుగా ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. పెద్దగా ఎక్కువ స్థాయిలో తగ్గక పోయినప్పటికీ ఈరోజు ధరలు పెరగలేదన్న తృప్తి మాత్రం కొనుగోలు దారుల్లో కనపడుతుంది. వెండి ధరలు కూడా ధరలు కొంత నేల చూపులు చేస్తున్నాయి. మొన్న లక్ష రూపాయల వరకూ చేరిన వెండి ధర దాదాపు పదిహేను వందల రూపాయల మేరకు కిలోపై తగ్గడంతో వెండిని కొనుగోలు చేసే వారు కూడా ఒకింత ముందుకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న ధరలు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సాధ్యం కాదు. వారికి ధరలు ఇప్పటికీ అందుబాటులో లేవన్నది వాస్తవం. ధరలు ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం, వెండి ధరలు ఎంత పెరిగినప్పటికీ కొనుగోళ్లు తగ్గకపోవడం మాత్రం చాలా అరుదుగానే జరుగుతుంటుంది. ఎక్కువ మంది తగ్గినప్పుడు కొనుగోలు చేయాలన్న యోచనలో ఉంటారు. అత్యవసరమైతే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత వరకూ తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,700 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా కొనసాగుతుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News