Gold Price Today : కొత్త ఏడాది షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి మాత్రం?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.;

Update: 2025-01-02 03:10 GMT

బంగారం అంటే అంతే మరి. ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. అలాగే స్థిరంగానూ ఉంటాయి. అయితే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకులే. అలాగే డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, అమెరికా లో అధ్యక్షుడ ఎన్నిక ఇలా.. ఒకటేమిటి.. ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పలేని పరిస్థితి. ఎవరి అంచనాలకు అందని విధంగా ధరలు అనూహ్యంగా పెరగడం కూడా బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది.

అమాంతం పెరిగి...
కొత్త ఏడాది తొలి రోజు కొంత బంగారం ధరల్లో తగ్గుదల కనిపించినా వెంటనే మధ్యాహ్నానికి మాత్రం ధరలు అమాంతం పెరగడంతో మదుపరులు కూడా ఆశ్చర్యపోయారు. తొలి నుంచి కొత్త ఏడాది బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్న నేపథ్యంలోనే ఇది జరిగినట్లుగా భావించాలి. ఈ ఏడాది మొత్తం గత ఏడాదిలాగే బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2026 సంవత్సరంఅయితే బంగారం ధరలు ఇకఎవరికీ అందనంత పెరుగుతాయని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ ముందుగానే అంచనా వేసి మరీ చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయని, అందుకే కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
బంగారం, వెండి వస్తువులు స్టేటస్ సింబల్ గా మారాయి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువుగా మారడంతో దీనికి డిమాండ్ పెరగడంతో దానికి అనుగుణంగా ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. అందుకే కొన్ని నెలల కాలంలోనే బంగారం ధరల్లో భారీ మార్పు వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాలకు ఎక్కువగా వినియోగించే బంగారం ధరలు మరింత పెరగడం ఖాయమని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరలపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వెయ్యిరూపాయల వరకూ తగ్గింది. హైదరాబాదద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,510 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,010 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 97,900 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News