Gold Price Today : కొత్త ఏడాది ఆనందమేగా... బంగారం ధరలు భారీగా తగ్గాయిగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

Update: 2025-01-01 03:54 GMT

కొత్త ఏడాది తొలి రోజును పసిడిప్రియులకు మంచి వార్త. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో వినియోగదారులు హ్యాపీ గా ఉన్నారు. నిన్నటి వరకూ ధరలు పెరిగి ఆందోళనకు గురయిన కొనుగోలుదారులు ఒక్కసారిగా ఇంత ధరలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ అలాంటిది. మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం విషయంలో ధరలు దోబూచులాడుతుండటంతో కొంత సందిగ్దంలో పడ్డారు. కొత్త ఏడాది ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం శుభపరిణామంగానే చూడాలి.

నిన్న మొన్నటి వరకూ...
నిన్న మొన్నటి వరకూ ధరలు అమాంతంగా ధరలు పెరిగాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవ్వడంతో బంగారం కొనుగోలు విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఎదుర్కొన్నారు. భవిష్యత్ లో ధరలు తగ్గుతాయని భావించిన వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ఒకింత ఆలోచన చేశారు. అందుకే కొనుగోళ్లు కూడా తగ్గాయంటున్నారు వ్యాపారులు. అయితే ఇంత భారీగా ధరలు తగ్గడంతో కొనుగోళ్లు కూడా భారీగా పెరుగుతాయని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారాన్ని నేడు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారన్న అంచనాలు పెరిగాయి. కొత్త ఏడాది సరికొత్త ఆభరణాలు, డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు జ్యుయలరీ దుకాణాలు ప్రయత్నిస్తున్నాయి.
భారీగా తగ్గడంతో...
కొత్త ఏడాదిలో బంగారం ధరలు దిగిరావడం శుభసూచమేనని అంటున్నారు. ధరలు మరింత పెరగకుండా ఈ ఏడాది బంగారం ధరలు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే కొనుగోలు చేయడానికి వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై నాలుగు వందల రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై 2,200 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,090 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,550 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 97,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News