గుడ్ న్యూస్.. ఇంత తగ్గినా?

ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. పది గ్రాముల బంగారం ధరపై రూ.220లు తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది

Update: 2023-09-27 03:23 GMT

బంగారానికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. పెరగడమే కాని తగ్గటం ఉండదు. తగ్గినా పెద్దగా ఉండదు. అందుకే బంగారం ధరలు తగ్గినా పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. అలాగే ధరలు పెరిగినప్పుడు మాత్రం కొనుగోలుదారులు ఎంత పెరిగాయన్నది ఉత్సుకతతో చూస్తుంటారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఈరోజు...
ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. పది గ్రాముల బంగారం ధరపై రూ.220లు తగ్గింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,750 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,730 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గడంతో ఈరోజు మార్కెట్ లో కిలో వెండి ధర 79,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది


Tags:    

Similar News