బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ బంగారం ధరలు పరుగు లంకించుకుంటుంది. ధరలు ఒక్కసారిగా పెరిగి ఆందోళనకు గురి చేస్తున్నాయి. నూతన సంవత్సర చివరి రోజును పసిడిప్రియులకు బంగారం ధరలు షాకిచ్చినట్లే కనపడుతుంది. అయితే ముందు నుంచి అంచనాలకు అనుగుణంగానే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈరోజు నుంచి ధరలు పెరగడం ప్రారంభించాయి. రేపు కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ కిలో వెండి ధర లక్షకు చేరువలో ఉంది.
అపురూపంగా...
బంగారం అంటేనే ఇప్పుడు అపురూపమైన వస్తువుగా మారిపోయింది. వెండి కూడా దాదాపు అంతే. గతంలో మాదిరి ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ఇళ్లలో బంగారం, వెండి వస్తువులు కనిపించే అవకాశం లేదంటున్నారు. గత పదేళ్లలో బంగారం ధరలు పెరిగిన ధరలు చూస్తుంటే ఇదే తెలుస్తుంది. అయితే అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగిందని దీనివల్ల బంగారం అమ్మకాలు పడిపోవడం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లపై ప్రభావం చూపిందని వ్యాపారులు చెబుతున్నారు. భవిష్యత్ లో బంగారం కొనుగోలు చేయాలంటే గగనమేనని, దానిని కొనుగోలు చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న ఛలోక్తులు కూడా వినిపిస్తున్నాయి.
భారీగా పెరిగి...
బంగారం అంటే ఇష్టపడే మహిళలు దానిని కొనుగోలు చేయకుండా ఉండలేకపోతున్నారు. అయితే చాలా మంది పొదుపుకోసం నెలకు ఒక గ్రాము చొప్పున కొనుగోలు చేసి తర్వాత దానిని ఆభరణాలుగా మలచుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 170 రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,510 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,010 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 99,800 రూపాయలుగా ట్రెండ్ అయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now