Gold Price Today : మళ్లీ ఎనభై వేలకు చేరుకున్న బంగారం ధరలు.. వెండి ధరలు కూడా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది;

Update: 2025-01-16 03:35 GMT

బంగారం ధరలు మరింత పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్న లెక్కలు నిజమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరుకుంది. ధరలు పెరగడం అనేది బంగారం విషయంలో మామూలు విషయంగానే చూడాలి. ఎందుకంటే ధరలు మరింత పెరుగుతాయని ఎప్పటి నుంచో మార్కెట్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అదే నిజమని నిరూపిస్తూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దాని వెంట వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. దీంతో కొనుగోలు చేయలేక వినియోగదారులు ఒకింత వెనకడుగు వేసే అవకాశముండటంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

అందుకే ధరలు...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గానే చూడటం ప్రారంభమయిన నాటి నుంచి దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వెండికి కూడా అదే మాదిరిగా డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఎన్ని బంగారం, వెండి వస్తువులు ఉంటే అంత గౌరవం సమాజం నుంచి మనకు లభిస్తుందని భావించేవారు ఎక్కువయ్యారు. కేవలం 1990 నాటి మహిళలే కాదు.. ఈ జనరేషన్ లో కూడా మహిళలు అందులోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉండటానికి సొంత ఇల్లు, వేసుకోవడానికి బంగారం నగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతోనే ఈ రెండు వస్తువులకు గిరాకీ పెరిగింది. దీంతో బంగారం, వెండి ధరలు కూడా అదుపులేకుండా పెరిగిపోతున్నాయి.
పెట్టుబడికి...
ఇక పెట్టుబడులు పెట్టే వారు కూడా బంగారాన్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. అందుకు కారణం సురక్షితమైన పెట్టుబడిగా భావించడం, నష్టాలు రావని తెలిసి అందులోనే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,080 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,410 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News