ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బవ్లా-బగోద్రా హైవేపై మినీ ట్రక్కు, ట్రక్కును ఢీకొట్టింది.

Update: 2023-08-11 09:48 GMT

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బవ్లా-బగోద్రా హైవేపై మినీ ట్రక్కు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు స‌మాచారం. ఈ ప్రమాదంలో మృతులను అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ధృవీకరించారు. బావ్లా-బగోద్రా హైవేపై మినీ ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందినట్లు అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తెలిపారు.

జాతీయ రహదారిపై బాగోద్ర సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును చిన్న ట్రక్కు ఢీకొనడంతో సుమారు 10 మంది మృతి చెందారు. మినీ ట్రక్కులో ఉన్నవారు చోటిలాను సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్ర‌క్కులో ముందు ముగ్గురు, వెనుక 10 మంది కూర్చుని ఉండ‌గా.. ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులను కపద్వాంజ్‌లోని సునాద గ్రామ నివాసితులుగా గుర్తించారు.


Tags:    

Similar News