యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో బీజేపీ నేత కుమారుడు?

జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నలుగురు యువకులు బాలికను, ఆమె సోదరిని అపహరించి ఓ ఇంటికి..

Update: 2023-07-16 12:19 GMT

gang assault

యువతిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మైనర్ సోదరిపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో జరిగింది. సామూహిక అత్యాచారం జరిగిన యువతి ఆత్మహత్యాయత్నం చేయగా.. మైనర్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఓ యువకుడు, ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిందితుల్లో బీజేపీ ఆఫీస్ బేరర్ కొడుకు పేరు కూడా వినిపిస్తుండటంతో.. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపుతోంది.

జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నలుగురు యువకులు బాలికను, ఆమె సోదరిని అపహరించి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సోదరిపై సామూహిక అత్యాచారం, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ మేరకు బాలిక ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక యువతి ఆత్మహత్యకు యత్నించిందని, ప్రస్తుతం ఆమె ఝాన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. నాలుగో వ్యక్తి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ప్రకటించామన్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా బీజేెపీ అధ్యక్షుడు సురేెంద్ర బుధోలియా.. బాలిక చెప్పినట్లు నిందితుల్లో తమపార్టీ నేత కుమారుడు ఉంటే.. అతనికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు.


Tags:    

Similar News