70 ఏళ్ల మహిళలను కిడ్నాప్ చేశారు.. వీడియో రికార్డు చేయడంతో!!

ఇద్దరు మహిళలను నలుగురు వ్యక్తులు వారి ఇంటి నుండి

Update: 2024-09-14 11:40 GMT

Ajmer, Rajasthan

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఆస్తి వివాదంపై ఇద్దరు మహిళలను నలుగురు వ్యక్తులు వారి ఇంటి నుండి కిడ్నాప్ చేశారు. ఆ మహిళలు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. కిడ్నాప్ ఉదంతాన్ని ఇరుగుపొరుగు వారు చిత్రీకరించారు. ఆ వీడియో సహాయంతో పోలీసులు వారిని ట్రాక్ చేసి అరగంటలో రక్షించారు. రికార్డ్ అయిన వైరల్ క్లిప్‌లో నలుగురు వ్యక్తులు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న కారులో వచ్చి రామ జైన్, కుంకుమ్ జైన్‌లను కిడ్నాప్ చేశారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి వీడియోను పోలీసులతో పంచుకున్నారు. దీంతో పోలీసులు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సహాయంతో నిందితులను ట్రాక్ చేసి ఇద్దరు మహిళలను రక్షించారు.

మహ్మద్ ఆదిల్ షేక్ అనే వ్యక్తి, అతని సహాయకులు ఈ కిడ్నాప్ వెనుక ఉన్నారని మహిళలు ఆరోపించారు. తమ పూర్వీకుల ఆస్తికి నకిలీ పత్రాలు తయారు చేశారని, దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునేందుకు కిడ్నాప్ కు యత్నించారని తెలిపారు. మారణాయుధాలతో తమని బెదిరించారని, ఇష్టమొచ్చినట్లు కొట్టారని కూడా మీడియాతో అన్నారు. మహ్మద్ ఆదిల్ షేక్ ఆస్తిపై 2 కోట్లు ఖర్చు చేశానని తమతో చెప్పడమే కాకుండా, తమ నుండి డబ్బు డిమాండ్ చేశాడని కూడా వారు ఆరోపించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News