పోలీసులకు పుష్పసినిమా చూపించిన గంజాయి స్మగ్లర్లు

గంజాయి తరలిస్తున్న ఒక బొలెరో, ఇన్నోవా ట్రక్‌ను పట్టుకొని సీజ్ చేశారు పోలీసులు. 280 కేసుల గంజాయితో పాటు సెల్‌పోన్స్..

Update: 2023-06-06 13:16 GMT

cannabis smuggling, pushpa style smuggling

తిరుపతి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది. గంజాయి స్మగ్లర్లు.. పోలీసులకు పుష్ప సినిమాలో సీన్ చూపించారు. ఎర్రచందనం దుంగల్ని వాహనంలో తరలించేందుకు పుష్ప వాడిన ట్రిక్ ను ఇక్కడ స్మగ్లర్లు కూడా వాడారు. గంజాయి స్మగ్లింగ్ కోసం బొలెరో వాహనాన్ని రీ మోడల్ చేశారు. అనకాపల్లి, విశాఖల నుంచి శ్రీలంకకు అక్రమంగా గంజాయిని తరలిస్తూ.. పోలీసులకు చిక్కారు. సూళ్లూరుపేట వద్ద వాహన తనిఖీల్లో పోలీసులకు అనుమానం రావడంతో వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు.

గంజాయి తరలిస్తున్న ఒక బొలెరో, ఇన్నోవా ట్రక్‌ను పట్టుకొని సీజ్ చేశారు పోలీసులు. 280 కేసుల గంజాయితో పాటు సెల్‌పోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 48 లక్షలు విలువచేసే 120 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితులు ఆనంద వేలు, బాలకిషన్, తిరుమలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన ఆనందవేలు పై రాజమండ్రి, విజయవాడ, తమిళనాడులో కేసులు నమోదయ్యాయని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లిలో అప్పలనాయుడు అనే వ్యక్తి ఇతనికి గంజాయి సప్లై చేస్తున్నాడని, అప్పలనాయుడు ఒడిశా బోర్డర్ నుంచి గంజాయిని సేకరిస్తున్నట్లు తెలిపారు. అప్పలనాయుడు టూ ఖాదర్ వయా ఆనందవేలుగా స్మగ్లింగ్ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. చెన్నై నుంచి శ్రీలంకకు సప్లై చేసే ఖాదర్ తో పాటు అప్పలనాయుడు కోసం ప్రత్యేక పోలీసుల బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.


Tags:    

Similar News