లారీని ఢీ కొట్టిన కారు.. ఐదుగురు ఇస్రో ఉద్యోగులు మృతి
సోమవారం వేకువజామున 1.30 గంటలకు ఏపీ నుండి బియ్యం బస్తాల లోడుతో కేరళలోని అంబలపూఝ జిల్లాలోని అలపూఝ;
అతివేగం ప్రాణలకు ప్రమాదకరమని.. రోడ్డుకి ఇరువైపులా మనకు బోర్డులు దర్శనమిస్తూనే ఉంటాయి. కానీ.. కొందరు ఏం కాదులే అన్న గుడ్డివైఖరితో వాహనాలను శృతిమించిన వేగంతో నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గతరాత్రి యూపీలో ఓ ట్రక్కు సృష్టించిన బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే కేరళలో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు.
సోమవారం వేకువజామున 1.30 గంటలకు ఏపీ నుండి బియ్యం బస్తాల లోడుతో కేరళలోని అంబలపూఝ జిల్లాలోని అలపూఝ వెళ్తోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పడంతో.. రెండు వాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి. తిరువనంతపురానికి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో.. కారులో ప్రయాణిస్తోన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.
మృతులు ఇస్రో క్యాంటీన్ లో పనిచేస్తున్న ప్రసాద్, అమల్, షిజు, సచిన్, సుమోద్ లుగా గుర్తించారు. నలుగురు ఘటనా ప్రాంతంలోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.