మల్కారం చెరువులో ఈతకెళ్లి 6గురు మృతి

ఆ తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు మల్కారం చెరువులో దిగారు. చెరువులో లోతును గమనించకుండా వెళ్లడంతో..;

Update: 2022-11-05 10:23 GMT

malkaram lake deaths

హైదరాబాద్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతిచెందారు. మృతులంతా అంబర్ పేటకు చెందిన వారేనని తెలుస్తోంది. నగర శివార్లలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఓ ఫంక్షన్ కు వెళ్లారు. ఆ తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు మల్కారం చెరువులో దిగారు. చెరువులో లోతును గమనించకుండా వెళ్లడంతో.. ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.

మొద‌ట ఐదుగురు విద్యార్థులు చెరువులో దిగి ఈత కొట్టేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో చెరువు మ‌ధ్య‌లోకి వెళ్లి నీట మునిగారు. ఒడ్డున ఉన్న ఉపాధ్యాయుడు.. నీటిలో మునుగుతున్న విద్యార్థుల‌ను గ‌మ‌నించాడు. వారిని కాపాడేందుకు ఉపాధ్యాయుడు కూడా చెరువులోకి దూకాడు. విద్యార్థుల‌ను కాపాడే క్ర‌మంలో టీచ‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికితీశారు. చ‌నిపోయిన పిల్ల‌లంద‌రూ 12 నుంచి 14 ఏళ్ల లోపు వారుగా గుర్తించారు. ఒకేసారి ఆరుగురి మరణంతో.. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News