63 మంది సజీవదహనం
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఓ భవనంలో మంటలు చెలరేగి 63 మంది మరణించారు.
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఓ భవనంలో మంటలు చెలరేగి 63 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 63 మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగం అధికారులు మాట్లాడుతూ మంటలు చాలా వరకు ఆర్పివేశామని.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒక వీధిలో మృతదేహాలను ఉంచారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది తాత్కాలిక నివాసమని, ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఎవర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు. ఆ భవనంలో కనీసం 200 మంది నివసిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.