క్లాస్ రూమ్ లో మరణించిన విద్యార్థిని..
స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ లో రియాను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని తెలిపారు. విషయం..
ఉదయం స్కూల్ కి వెళ్లిన విద్యార్థిని.. ప్రేయర్ అనంతరం క్లాస్ రూమ్ లో కుప్పకూలిపోయింది. ఆమెను పరిక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించిందని చెప్పారు. స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వగా.. వారు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిందీ ఘటన. 14 ఏళ్ల రియాసాగర్.. గొండాల్ రోడ్ లో ఉన్న ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. ఉదయం 7 గంటలకు రియా స్కూల్ కి వెళ్లగా.. 7.23 గంటలకు క్లాస్ రూమ్ లో స్పృహకోల్పోయి పడిపోయింది.
స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ లో రియాను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. అతిశీతల వాతావరణం కారణంగానే తన కూతురు చనిపోయినట్లు ఆరోపించారు. కొద్దిరోజులుగా నార్త్ ఇండియాలో 8 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. తీవ్రమైన చలి కారణంగా.. రియా శరీరంలో రక్తం గడ్డకట్టి మరణించిందని తల్లి జానకి పేర్కొన్నారు. తన కూతురికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు.