చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఒక బాలుడు మరణించిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.;

Update: 2022-11-27 03:41 GMT

చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఒక బాలుడు మరణించిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పిన్నవారి వీధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లిన బాలుడు సందీప్ చాక్లెట్ తినేందుకు ప్రయత్నించాడు. అయితే చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో సందీప్ ఊపిరాడక కింద పడిపోయాడు. క్లాస్ రూమ్ లోనూ స్పృహతప్పి పడిపోయాడు. సందీప్ కు ఎనిమిదేళ్ల వయసు.

శ్వాస ఆడక...
వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు సందీప్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చాక్లెట్ గొంతులో ఇరుక్కుని మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్వాస ఆడక సందీప్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. బాలుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్లు తిని గొంతులో ఇరుక్కుని మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు


Tags:    

Similar News