ఛత్తీస్‌ఘడ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు;

Update: 2022-09-12 05:14 GMT

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. కోర్బా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో...
ఈరోజు వేకువ జామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. రాయపూర్ నుంచి సీతాపూర్ కు పొడి ఉపోర్దా హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News