గర్భిణిపై సామూహిక అత్యాచారం.. భర్తను కట్టేసి

గర్భిణికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, బాధితురాలి రక్త నమూనాను కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం

Update: 2022-06-06 13:39 GMT

పాకిస్థాన్ లో మహిళలపై అఘాయిత్యాలకు ఎండ్ కార్డు పడడం లేదు. రోజూ ఏదో ఒక చోట మహిళలపై తీవ్రమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా నిలిచింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. ఐదుగురు సాయుధ వ్యక్తులు జీలం నగరంలోని ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డారని డైలీ పాకిస్థాన్ తెలిపింది. నిందితుల బృందం మొదట బాధితురాలి భర్తపై దాడి చేసి.. ఆ తర్వాత అతడిని తాడుతో కట్టివేశారు. ఈ ఘటన తర్వాత పంజాబ్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గర్భిణికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, బాధితురాలి రక్త నమూనాను కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

గత నెలలో కరాచీ మహిళపై కదులుతున్న రైలులో సామూహిక అత్యాచారం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మహిళల హక్కుల విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళపై టికెట్ చెకర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె గత వారం కరాచీ నుండి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్‌కు ప్రయాణిస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ సిఎన్‌ఎన్ నివేదించింది. ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారనే అనుమానంతో అరెస్టులు జరిపారు.


Tags:    

Similar News