మొబైల్ వాడొద్దని మందలించిన తల్లి.. క్షణికావేశంలో కుమార్తె..?
స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడిపోయిన ఓ యువతిని.. తల్లి ఎక్కువగా ఫోన్ వాడొద్దని మందలించింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది
మొబైల్.. ప్రస్తుతం వయసు, జనరేషన్ తో సంబంధం లేకుండా వాడుతున్న ఆయుధమిది. ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. అంతలా అడిక్ట్ అయిపోయారు స్మార్ట్ ఫోన్లకు. పిల్లలు అన్నం తినడం లేదని ఫోన్ లో బొమ్మలు చూపించి పెట్టడం మొదలు.. ఇక అదే అలవాటుగా మారి, దాన్ని వదిలి ఉండలేనంతగా తయారవుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. ఒకప్పుడు అంటే ఈ స్మార్ట్ ఫోన్లు లేని సమయంలో.. చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేవారు. లేదా తినకపోతే బూచోడు వస్తాడని భయపెట్టి తినిపించేవారు. ఇప్పుడు పిల్లలు అలా కాదు. ఫోన్ ఇస్తావా.. సస్తావా అన్నట్లు తయారయ్యారు. పూర్తిగా ఊహ తెలియకముందు నుంచే స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేసేస్తున్నారు. మంచికి వాడితే పర్లేదు.. కానీ అనవసరమైన కంటెంట్ ను చెవికెక్కించుకుంటున్నారు. అదే మున్ముందు తరాలకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.