టర్కీలో ఘోర ప్రమాదం.. 25 మంది మృతి
టర్కీలో ఘోర ప్రమాదం సంభవించింది. బొగ్గుగనిలో జరిగిన పేలుడు కారణంగా 25 మంది మరణించారు
టర్కీలో ఘోర ప్రమాదం సంభవించింది. బొగ్గుగనిలో జరిగిన పేలుడు కారణంగా 25 మంది మరణించారు. 110 మంది వరకూ గాయపడ్డారు. ఉత్తర బార్టిన్ ప్రావిన్స్ లోని బొగ్గుగనిలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో బొగ్గుగనిలో మొత్తం 110 మంది పనిచేస్తున్నారని అధికారులు చెప్పారు. వారిలో 11 మందిని సహాయక బృందాలు రక్షించి చికిత్సను అందిస్తున్నారు.
బొగ్గుగనిలో పేలుడు కారణంగా ...
బొగ్గుగనిలో పేలుడు కారణంగా బయటకు రావడానికి కూడా వీలు పడలేదు. సహాయక బృందాలకు కూడా కష్టసాధ్యంగా మారింది. గనిలోపల 985 అడుగుల దిగువన ఈ పేలుడు సంభవించినట్లు టర్కీ మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు. ఈ గని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నదే. పేలుడుకు గల కారణాలపై అధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.