శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువతి హల్ చల్....మద్యంమత్తులో దాడి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక యువతి మద్యం మత్తులో ఉద్యోగిపై దాడికి దిగింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒక యువతి మద్యం మత్తులో ఉద్యోగిపై దాడికి దిగింది. ఇండిగో ఎయిర్ లైన్స్ లో వస్తున్న ప్రయాణికురాలు అతిగా మద్యం తాగి ఇండిగో ఉద్యోగిపై దాడికి దిగింది. అసభ్యకర పదజాలంతో దూషించింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా యువతి ఉద్యోగిపై దాడికి దిగింది.
అదుపులోకి తీసుకుని...
దీంతో ఉద్యోగి శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ యువతిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.