ఘోర బోటు ప్రమాదం.. 105 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియాలో ఘోర ప్రమాదం సంభవించింది. బోటు మునిగిన ఘటనలో 105 మంది మరణించారు
పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియాలో ఘోర ప్రమాదం సంభవించింది. బోటు మునిగిన ఘటనలో 105 మంది మరణించారు. ఇప్పటి వరకూ 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. బోటు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మందిని మాత్రమే సహాయక బృందాలు రక్షించగలిగాయి. పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి కానరీ దీవులకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనదని చెబుతున్నారు. అట్లాంటిక్ వలస మార్గం ప్రయాణం ప్రమాదకరమైనదైనప్పటికీ ఆఫ్రికన్ వలసదారులు ఈ మార్గం నుంచి ప్రయాణించడం మామూలయింది.
వలసదారులను...
తరచూ ఈ ప్రయాణంలో ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది వలస దారులు వివిధ బోటు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిపారు. ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి సులువైన మార్గం కావడంతో దీనిని ఎంచుకున్నారు. ఈ మార్గంలో ఇంత పెద్ద సంఖ్యలో వలసదారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.