హోటల్ గదిలో యువనటి బలవన్మరణం
కాగా.. బలవన్మరణానికి ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియో సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్‌లో..;
భారతీయ చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భోజ్ పురికి చెందిన యువనటి ఆకాంక్ష దూబే (25)బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని వారణాసిలో ఓ హోటల్ లోని గదిలో ఆకాంక్ష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి షూటింగ్ నుంచి వచ్చిన ఆకాంక్ష సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమేంద్ర హోటల్ కు చేరుకుంది. ఆదివారం హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించగా.. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆకాంక్ష దూబే 1994, అక్టోబర్ 21న యూపీలోని మీర్జాపూర్ లో జన్మించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా.. బలవన్మరణానికి ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియో సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సాంగ్‌లో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్‌తో కలిసి నటించింది. భోజ్‌పురి పరిశ్రమలో రాకేష్ మిశ్రా మ్యూజిక్ వీడియో ‘తు జవాన్ హమ్ లైకా’తో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత.. ఆకాంక్ష ప్రతి భోజ్‌పురి స్టార్‌తో బుల్లెట్ పై జీజా, కార్వతి వంటి అనేక భోజ్‌పురి మ్యూజిక్ వీడియోల్లో పని చేసింది. భోజ్‌పురిలో ముజ్‌సే షాదీ కరోగి, వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా.. ఆమె సమర్ సింగ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం.