కొడుకుని కత్తితో పొడిచిన తండ్రి.. కారణం తెలిస్తే..

ఈ క్రమంలో చెల్లింపుల నిమిత్తం అతని మొబైల్ ఫోన్ లో ఒక ఆన్ లైన్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు.;

Update: 2023-06-18 09:38 GMT
father stabs son in delhi

father stabs son in delhi

  • whatsapp icon

మొబైల్ యాప్ డౌన్ లోడ్ అవడంలో జాప్యం జరిగిందన్న కారణంతో భార్యతో గొడవపడుతుండగా.. అడ్డొచ్చిన కొడుకుని కత్తితో పొడిచాడు తండ్రి. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అశోక్ సింగ్ (64) అనే వ్యక్తి ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఆదిత్య(23) ఉన్నారు. ఆదిత్య ప్రస్తుతం కంప్యూటర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అశోక్ గురుగ్రామ్ లో ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు.

ఈ క్రమంలో చెల్లింపుల నిమిత్తం అతని మొబైల్ ఫోన్ లో ఒక ఆన్ లైన్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. ఈ డౌన్ లోడింగ్ లో జాప్యం జరగడంతో అసహనానికి గురైన అశోక్ సింక్.. భార్యతో గొడవకు దిగాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. తల్లిదండ్రులు గొడవ పడుతుండగా.. మధ్యలో ఆదిత్య అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆదిత్యను కడుపులో కత్తితో పొడిచాడు తండ్రి అశోక్ సింగ్. ఫలితంగా అతను ఆస్పత్రి పాలయ్యాడు. గాయాలకు చికిత్స చేసిన అనంతరం వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. కాగా, పోలీసులు నిందితుడు అశోక్‌పై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News