ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది మృతి

60 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి గురైన బస్సు కొరియాంకా..

Update: 2023-01-29 07:36 GMT

peru road accident,

దక్షిణ అమెరికా వాయువ్యంలో ఉన్న పెరూలో ఘోర బస్సుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో.. 25 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 60 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదానికి గురైన బస్సు కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందినదని వివరించారు. లిమా నుంచి టంబెస్ కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు లోయలో పడటంతో.. స‌హాయ‌క చ‌ర్య‌లు కష్టతరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు.. బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా.. పర్యాటకులుగా తెలుస్తోంది. చాలామంది ప్రయాణికులు హైతీకి చెందిన వారుగా గుర్తించారు.




Tags:    

Similar News