Paris: కొద్ది రోజుల్లో పారిస్ ఒలింపిక్స్.. ఇంతలో అంత దారుణమా!!

ఒలింపిక్స్‌కు కొద్దిరోజుల ముందు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళపై

Update: 2024-07-24 03:19 GMT

ఒలింపిక్స్‌కు కొద్దిరోజుల ముందు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూలై 20 అర్ధరాత్రి తర్వాత మహిళపై దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దర్యాప్తు ప్రారంభించామని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత రాజధానిలోని పిగల్లే ప్రాంతంలోని కబాబ్ షాపులో ఆ మహిళ తలదాచుకుంది.

CCTV ఫుటేజీలో ఆమె దుకాణంలోకి పరిగెత్తడం, పాక్షికంగా చిరిగిపోయిన తన దుస్తులతో సిబ్బందిని సహాయం కోరడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించి మహిళను చూస్తూ ఉంటాడు. అతను తనపై దాడి చేసిన గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్నాడని మహిళ సైగ చేయగా.. కబాబ్ షాప్ సిబ్బంది అతడిని ప్రశ్నించడం మొదలుపెడతారు. వెంటనే ఆ వ్యక్తి రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లిపోవడం చూడవచ్చు. షాపు యజమానులు ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులను పిలిపించగా.. ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు.
ఆస్ట్రేలియా ఒలింపిక్ టీమ్ చీఫ్ అన్నా మీరెస్‌ పారిస్ నగరంలో భద్రత ఉందని అథ్లెట్లకు తెలియజేసినట్లు ఆమె చెప్పారు. మా అథ్లెట్లు సురక్షితంగా లేరని తమకు ఇంకా ఎలాంటి ఫీడ్‌బ్యాక్ లేదని.. స్పోర్ట్స్ విలేజ్ నుండి స్వంతంగా బయటకు వెళ్లవద్దని సూచించామన్నారు. జట్టు యూనిఫాం ధరించవద్దని, సాధారణ దుస్తులు ధరించమని మేము వారిని ప్రోత్సహిస్తున్నామని మీరెస్‌ తెలిపారు. జూలై 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ హై అలర్ట్‌లో ఉంది.


Tags:    

Similar News