బార్ లో కాల్పులు.. తొమ్మిది మంది మృతి

Update: 2022-11-11 07:18 GMT

సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో డ్రగ్స్ కార్టెల్ బృందాల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా.. హింసాత్మక ఘటనలు ఎక్కువవుతూ ఉన్నాయి. సెలయా వెలుపల ఉన్న అపాసియో ఎల్ ఆల్టో పట్టణంలో బుధవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సాయుధ బృందం బార్ వద్దకు వచ్చి లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించారు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారని.. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ కాల్పులకు తెగబడిన వ్యక్తులను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో ఈ దాడులకు పాల్పడిన గ్యాంగ్ రెండు పోస్టర్లు వదిలిపెట్టారని.. ఇతర గ్యాంగ్ కు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పారిశ్రామిక కేంద్రమైన గ్వానాజువాటో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. గత నెలలో, ఇరాపుటో నగరంలోని ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో కార్టెల్ హింసను తగ్గిస్తానని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News