బీహార్ పేలుడు ఘటన : 14కి చేరిన మృతుల సంఖ్య
ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేసి.. ప్రమాదానికి గల కారణాలు, సహాయక ..
భాగలాపూర్ : బీహార్ లోని భాగలాపూర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ 14 మంది చనిపోగా.. 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై ఏటీఎస్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేసి.. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
Also Read : బ్రేకింగ్ : కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న స్థానిక పీఎస్ ఇన్ చార్జ్ సుధాంశు కుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై బీహార్ డీజీపీ ఎస్ కే సిబ్గాల్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఇంటిని అద్దెకు తీసుకుని బాణాసంచా తయారీ నడుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనకు సంబంధించి ఏటీఎస్ విచారణ చేపట్టనుందని, ప్రస్తుతం నమూనాలను సేకరించే పనిలో ఉందన్నారు. ముడి బాంబులు, బాణసంచా తయారీ ఉపయోగించే పౌడర్, ఇనుప మేకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.