శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు

తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ప్రకాశ్ అప్పుల పాలయ్యాడు. తొట్టంబేడు పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్ లో తనకున్న స్థలం సమీపంలో

Update: 2022-04-02 07:01 GMT

శ్రీకాళహస్తి : ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గుప్తనిధులు, శత్రువులకు హాని చేయడం వంటి నమ్మకాలతో క్షుద్రపూజలు నిర్వహించినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన ఐదుగురు మంత్రగాళ్ల ద్వారా గుప్తనిధుల కోసం ప్రత్యేక పూజలు చేశారు. అర్థరాత్రి సమయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు.

తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ప్రకాశ్ అప్పుల పాలయ్యాడు. తొట్టంబేడు పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్ లో తనకున్న స్థలం సమీపంల అతని స్నేహితులు కుమార్, ఓం ప్రకాష్ లతో కలిసి క్షుద్రపూజలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తాంత్రిక పూజలను భగ్నం చేసి, 8 మందిని తొట్టంబేడు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. జనసంచారం పెద్దగా ఉండకపోవడంతో కొందరు ఈ ప్రదేశాన్ని క్షుద్ర పూజలకు నిలయంగా మార్చుకున్నారు. అమావాస్య కావడంతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News