లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన "బుల్లెట్ బండి" పెళ్లికొడుకు

ఆకుల అశోక్ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సాయిశ్రియ..

Update: 2022-09-21 05:14 GMT

'నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' పాటతో ఓవర్ నైట్ స్టార్‌ గా మారిన సాయిశ్రియ - అశోక్ జంట గుర్తుందా ? పెళ్లయ్యాక అప్పగింతల సమయంలో ఆ పాటకు తన భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియో తర్వాత చాలా మంది ఆ ఒరిజినల్ సాంగ్ కోసం సెర్చ్ చేయడంతో.. లక్షల వ్యూస్ వచ్చాయి. ఏడాది క్రితం జరిగిందీ ఘటన. ఇప్పుడు ఆ బుల్లెట్ బండి పెళ్లికొడుకే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఆకుల అశోక్ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సాయిశ్రియ విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గా పనిచేస్తోంది. తాజాగా అశోక్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇంటి నిర్మాణం కోసం అనుమతి మంజూరుకు వచ్చిన దేవేందర్ రెడ్డిని అశోక్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా అశోక్ తో పాటు శ్రీనివాసరాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ లోని శ్రీనివాస్ ఇంటిలో, కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.


Tags:    

Similar News