బైకర్ ను ఢీ కొట్టిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి ఎగిరిపడ్డ యువకుడు

బైకర్ ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో.. యువకుడు బ్రిడ్జి పై నుంచి పడి, తీవ్రగాయాలతో

Update: 2022-02-05 06:10 GMT

హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఇటీవలే ప్రారంభమైన కొత్త ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి షేక్ పేట్ ఫ్లై ఓవర్ పై వేగంగా వచ్చిన కారు.. బైక్ ను ఢీ కొట్టింది. రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో.. బైక్ పై వెళ్తున్న యువకుడు ఫ్లై ఓవర్ పై నుంచి ఎగిరి కిందపడటంతో.. అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బైకర్ ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో.. యువకుడు బ్రిడ్జి పై నుంచి పడి, తీవ్రగాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News