రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు.. వీడియో ఇదిగో !
ఆగి ఉన్న ట్రక్కు వెనుకనుంచి మరో ట్రక్కు వచ్చింది. అది అదుపు తప్పి రెండు ట్రక్కుల మధ్యలో ఉన్న కారును ఢీ కొట్టుకుంటూ..
భువనేశ్వర్ : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాగి డ్రైవ్ చేయడం, అతివేగం ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా భువనేశ్వర్ లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. ఆ వీడియో చూస్తే భయభ్రాంతులకు గురవ్వాల్సిందే. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు రోడ్డుపై ఆగిపోయింది.
ఆగి ఉన్న ట్రక్కు వెనుకనుంచి మరో ట్రక్కు వచ్చింది. అది అదుపు తప్పి రెండు ట్రక్కుల మధ్యలో ఉన్న కారును ఢీ కొట్టుకుంటూ ట్రక్కును ఢీ కొట్టింది. భువనేశ్వర్‌లోని పాలసుని ప్రాంతంలో జాతీయ రహదారి-16పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై 5 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం అనంతరం డంప్ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.