దేశ వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
దేశంలో 70 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుపుతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు చేస్తుంది.
దేశంలో 70 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుపుతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు చేస్తుంది. ఆన్ లైన్ లో చిన్న పిల్లల పోర్న్ వీడియోలు పెడుతున్న వారిని గుర్తించింది. దీని వెనక పెద్ద ముఠా ఉన్నట్లు సీబీఐ కనుగొనింది. ఈ కేసులో మొత్తం 83 మంది నిందితులుగా సీబీఐ గుర్తించింది. ఇప్పటికే వీరిలో 23 మందిపై కేసులు నమోదు చేసింది.
14 రాష్ట్రాల్లో....
దేశ వ్యాప్తంగా సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, యూపీ, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ , హిమాాచల్ ప్రదేశ్, బీహార్ , ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలలో సోదాలు జరుపుతుంది. ఈ సోదాల్లో మరింత మంది నిందితులు దొరికే అవకాశముంది.