RGKar Medical College: ఆ దారుణం మొత్తాన్ని ఒక్కడే చేశాడు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం

Update: 2024-10-07 10:56 GMT

SanjayRoy

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్యాంగ్ రేప్ అనుమానాలను తోసిపుచ్చింది. కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ ఛార్జ్ షీట్ ప్రకారం, సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఛార్జ్ షీట్‌లో సామూహిక అత్యాచారం ఆరోపణలు లేవని, రాయ్ ఒంటరిగానే ఈ దారుణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. 33 ఏళ్ల సంజయ్ రాయ్ ఆగస్టు 10న అరెస్టు చేసిన తర్వాత నేరాన్ని మొదట అంగీకరించాడు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షలో తనను ఇరికించారని, నిర్దోషి అంటూ పేర్కొన్నాడు. RG కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైన ఒక రోజు తర్వాత రాయ్ ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి మృతదేహానికి సమీపంలో ఉన్న బ్లూటూత్ పరికరం రాయ్ అరెస్టుకు దారితీసింది. అత్యాచారం, హత్య విషయాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఆగస్టు 13న ఆదేశించింది.
Tags:    

Similar News