పచ్చనికాపురంలో పచ్చడి పెట్టిన చిచ్చు
పచ్చడి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోనిలో జరిగింది;

chandana committed suicide due to a quarrel between the two
పచ్చడి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు చందన, రమణ ప్రేమించి వివాహం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చందన ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే రాత్రి భోజనం సమయంలో పచ్చడి ఎక్కువగా వేశావంటూ రమణ తన భార్య చందనతో గొడవ పడ్డాడు. చందన సర్దిచెబుతున్నా రమణ వినలేదు.
చనిపోతానని చెప్పి...
వినకుండా తన డ్యూటీకి వెళ్లిపోయాడు. డ్యూటీకి వెళ్లిన నిన్న తన భర్త రమణకు వీడియో కాల్స్ చేసింది. అయితే రమణ రెస్పాండ్ కాలేదు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ పెట్టేయడంతో రమణలో టెన్షన్ మొదలయింది. వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడాలని కోరాడు. కానీ అపప్పటికే చందన సూసైడ్ చేసుకుని మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.