నాటు బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. రెండు చేతులు కోల్పోయిన గ్యాంగ్ స్టర్

కార్తీ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆస్పత్రిలో తెలుసుకున్న ప్రాథమిక సమాచారం..

Update: 2023-02-05 10:31 GMT

chennai gangster karthi, notorious gangster, crude bomb

నాటు బాంబు తయారు చేస్తుండగా అది చేతిలోనే పేలిపోయింది. దాంతో ఓ గ్యాంగ్ స్టర్ తీవ్రంగా గాయపడి రెండు చేతుల్నీ పోగొట్టుకున్నాడు. కాళ్లకు కూడా తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘటన. చెన్నైకి చెందిన ఒట్టెరి కార్తీ కరుడుగట్టిన నేరస్థుడు.

"పుఝల్ జైలులో విజయ్ కుమార్ అనే వ్యక్తితో కార్తికి పరిచయం ఏర్పడింది. రెండు రోజుల క్రితం అంబత్తూర్ లోని ఒరగడాం సమీపంలో కుక్కపిల్లను కొనుగోలు చేస్తానంటూ విజయకుమార్‌ వద్దకు వచ్చాడు. విజయ్ కుమార్ ఇంటిపై నాటు బాంబు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బాంబు పేలింది" అని పోలీసులు వెల్లడించారు. పేలుడు ధాటికి కార్తీ చేతులు పూర్తిగా ఛిద్రమవడంతో.. వాటిని తీసివేయాలని డాక్టర్లు స్పష్టం చేశారు.
కార్తీ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆస్పత్రిలో తెలుసుకున్న ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు ? వాటిని ఎక్కడ, ఎవరిపై ఉపయోగిస్తారు ? తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


Tags:    

Similar News