మందుపాతరతో మావోల దాడి.. 11 మంది పోలీసులు మృతి
ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూసేష్ బఘేల్ స్పందించారు. డీఆర్ జీ వాహనంపై మావోలు దాడి చేయడం బాధాకరమన్న..
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతరతో మావోలు చేసిన దాడిలో 11 మంది పోలీసులు అమరులయ్యారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. మృతుల్లో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ ఉన్నారు. వీరంతా డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ ఫోర్స్ కు చెందినవారుగా గుర్తించారు.
ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూసేష్ బఘేల్ స్పందించారు. డీఆర్ జీ వాహనంపై మావోలు దాడి చేయడం బాధాకరమన్న ఆయన.. అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నక్సల్స్ ఏరివేతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా.. దంతేవాడ జిల్లాలోని అరన్ పూర్ సమీపంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం లక్ష్యంగా చేసుకుని మందుపాతర ఏర్పాటు చేసి, వాహనం ఆ మార్గంలో వెళ్తుండగా పేల్చివేశారు. మృతులు రామ్‌కుమార్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్), టికెశ్వర్ ధ్రువ్ (అసిస్టెంట్ కానిస్టేబుల్ కేఫ్, ధామ్తారి), సలిక్ రామ్ సిన్హా(కానిస్టేబుల్, కంకర్), విక్రమ్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్), రాజేష్ సింగ్ (కానిస్టేబుల్,ఘజిపూర్, అప్), రవి పటేల్ (కానిస్టేబుల్), జవన్ అర్జున్ రాజ్‌భర్ (కానిస్టేబుల్) లుగా గుర్తించారు.