రోజూ ఎగతాళి చేస్తున్నాడని.. భర్తను నరికి చంపిన భార్య

అమలేశ్వర్ గ్రామంలో అనంత్ (40), సంగీత దంపతులు నివసిస్తున్నారు. అనంత్ సోన్వానీ మొదటి భార్య చనిపోవడంతో..

Update: 2022-09-28 11:53 GMT

నువ్వు అందంగా లేవు.. నల్లగా ఉన్నావ్.. నాకు నచ్చలేదు.. ఇలా రోజూ ఓ భర్త తన భార్యను ఎగతాళి చేస్తుండేవాడు. కొన్నాళ్లు అలానే భరించిన భార్య.. ఉన్నట్టుండి మారిపోయింది. తనను అదే పనిగా ఎగతాళి చేయడం భరించలేక.. దారుణమైన నిర్ణయం తీసుకుంది. భర్తని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసింది. అంతటితో ఆగలేదు అతని మర్మాంగాన్ని కూడా కోసేసింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

అమలేశ్వర్ గ్రామంలో అనంత్ (40), సంగీత దంపతులు నివసిస్తున్నారు. అనంత్ సోన్వానీ మొదటి భార్య చనిపోవడంతో.. రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి సంగీతను అసభ్యంగా పిలిచేవాడు. నల్లగా ఉన్నావంటూ ఆమెను దూషించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గతంలో పలుమార్లు గొడవలు సైతం జరిగాయన్నారు. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై గొడవ జరగ్గా.. సంగీత తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది. అతని మర్మాంగాన్ని నరికేసింది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సోమవారం తెల్లవారుజామున సంగీత తన భర్తను ఎవరో హత్య చేశారంటూ కేకలు పెట్టి.. గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు పలు కోణాల్లో విచారించారు. అనంతరం సంగీతను ప్రశ్నించగా.. తన నేరాన్ని అంగీకరించింది. నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పటాన్ ప్రాంతం పోలీసు అధికారి దేవాన్ష్ రాథోడ్ తెలిపారు.


Tags:    

Similar News