మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన సిటీ బస్సు

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనలో బస్సు ముందు భాగం;

Update: 2022-04-13 09:33 GMT

మలక్ పేట : హైదరాబాద్ లోని మలక్ పేట రోడ్డులో ప్రమాదం జరిగింది. మలక్ పేట కూడలి వద్ద సిటీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News