కానిస్టేబుల్ పై మందుబాబు దాడి

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది.;

Update: 2021-12-16 13:20 GMT

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై మందుబాబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. మద్యం సేవించి అత్తగారింట అల్లరి చేస్తున్న వ్యక్తిపై 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. మద్దెలకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడాన్ని పోలీసులు చూశారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించగా.. వాగ్వాదానికి దిగాడు.

మద్యం మత్తులో....
దాంతో పోలీసులు - మద్దెల కృష్ణకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ పక్కనే ఉన్న ఇటుకరాయి తీసి కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై కొట్టాడు. దాంతో కానిస్టేబుల్ తలకు తీవ్రగాయమవ్వగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కృష్ణను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలివ్వడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


Tags:    

Similar News