రాజస్థాన్ లో మత ఘర్షణలు.. కర్ఫ్యూ విధింపు
విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 50 మంది ఆఫీసర్లతో పాటు 600 మంది పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపుచేశారు.
కరౌలి : హిందూ నూతన సంవత్సరాది రోజున రాజస్థాన్ లోని జైపూర్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరౌలిలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హిందూ యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉండే ప్రాంతంమీదుగా వెళ్తున్న సమయంలో.. వాళ్లపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాంతో ఘర్షణలు మొదలయ్యాయి. ఆగ్రహించిన యువకులు షాపులు, బైకులకు నిప్పంటించారు.
విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 50 మంది ఆఫీసర్లతో పాటు 600 మంది పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపుచేశారు. ఘర్షణలకు పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మతఘర్షణల నేపథ్యంలో కరౌలీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘర్షణల్లో 42 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ఆదేశించారు.