Drugs : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ స్వాధీనం

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.;

Update: 2023-03-18 03:23 GMT

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 11.28 కోట్ల విలువైన కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు జరుపుతుండగా కొకైన్ అక్రమంగా, గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న విషయం బయటపడింది.

కడుపులో దాచి...
బ్రెజిల్ కు చెందిన ఒక వ్యక్తి కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి కొకైన్ ను ఎయిర్‌.పోర్టు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతను కడుపులో 753 గ్రాముల కొకైన్ ను దాచుకున్నాడు. అయితే దీనిని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు అతనిని పట్టుకుని విచారించి, కడుపులో ఉన్న కొకైన్ ను బయటకు తీయించారు. అతనిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News